త్వరలో విడుదల కానున్న మహేష్ సినిమాపై బూతు ముద్ర పడుతుంది. ‘ప్రస్థానం’, ‘గుండెల్లో గోదారి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ కిషన్ నటించిన ‘యారుడా మహేష్’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘మహేష్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ఈ సినిమా అక్కడ ఆశించిన వసూళ్లనే సాధించింది. అయితే బూతు చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.

ఇటీవల కాలంలో తెలుగులో కొన్ని బూతు సినిమా మంచి వసూళ్ళను సాధించాయి. ఈ క్రమంలో ఈ ‘మహేష్’ కూడా ఇక్కడ మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. తెలుగులో ఈ సినిమాను సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సమర్పకుడిగా దర్శకుడు మారుతి వ్యవహరిస్తుండటం విశేషం. మారుతి కి ఇప్పటికే బూతు సినిమాల డైరెక్టర్ గా పేరున్న విషయం తెలిసిందే.

త్వరలో విడుదల కానున్న ఈ మహేష్ సినిమాకు ఆర్.మదన్ కుమార్ దర్శకత్వం వహించగా డింపుల్ చోపడే కథనాయికగా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: