హస్యనటుడు నుంచి స్టార్ హీరోగా మారిన సునీల్ పై మహిళా దర్శకురాలి దృష్టి పడింది. అతనితో సినిమా తీయాలని ఆమె భావిస్తుంది. ఇటీవల ఆదితో ‘లవ్లీ’ సినిమా రూపొందించిన మహిళ దర్శకురాలు బి.జయ తన కొత్త సినిమాను సునీల్ తో రూపొందించాలని భావిస్తుంది. ఇందు కోసం ఆమె సునీల్ తో సంప్రదింపులు జరుపుతుంది. ఆమె ఇప్పటికే ఒక కథను సునీల్ గా వినిపించినట్లుగా తెలుస్తుంది. త్వరలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా, జర్నలిజం నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన బి.జయ గతంలో ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘గుండమ్మ గారి మనవడు’, ‘సవాల్’ అనే సినిమాలను రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: