అప‌రిచితుడు లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ త‌రువాత శంక‌ర్ , విక్రమ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మ‌రో క్రేజీ ఫిల్మ్ ఐ. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో మూడు భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమాకి సంబందించి ఇటు ఇండ‌స్ట్రీ , అటు అభిమానుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది. అయితే నిన్నటిదాకా ఈ సినిమాకు సంబందించి ఏ విష‌యాలు బ‌య‌ట‌కు రానివ్వలేదు డైరెక్టర్ శంక‌ర్.
కానీ ఈ మూవీకి సంబందించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు  కోలీవుడ్ లో చ‌క్కర్లు కొడుతున్నాయి.  అవేంటంటే ఈ సినిమాలో విక్రమ్ బాడీ బిల్డర్ గా క‌నిపిస్తాడ‌ట‌. అంతేకాదు రెండు విభిన్నమైన పాత్రల్లో విక్రమ్  యాక్టింగ్  ఇర‌గ‌దీశాడ‌ని స‌మాచారం. తెలుగులో మ‌నోహ‌రుడుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఎ.ఆర్.రెహామాన్ మ్యూజిక్ మ‌రో ఎస్సెట్ అవుతుంద‌ని మూవీ యూనిట్ అంటోంది.
ఇక బాడీ బిల్డర్ గా జాతీయ స్దాయిలో గుర్తింపు పొందిన ఎమ్. కామ‌రాజు ఈ సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ట‌. మ‌రి  చాలా ప్రత్యేక‌త‌లతో రూపొందుతున్న ఐ ఫ్లాప్స్ తో అల్లాడిపోతున్న విక్రమ్ కెరీర్ ని రీచార్జ్ చేస్తుందేమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: