‘ముంబాయ్ వాళ్ళను...పోయించడానికి వచ్చాను’ అంటూ ‘బిజెనెస్ మేన్’ సినిమాలో డైలాగులు చెప్పిన ప్రిన్స్ మహేష్, సంచలనం సృష్టించిన అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తానని పూరీ అడిగినా గతంలో ప్రిన్స్ కాదన్నాడు. అంతేకాదు తన దృష్టి అంతా టాలీవుడే, బాలీవుడ్ కాదు అని స్వయంగా ప్రిన్స్ గతంలో మీడియాకు చెప్పాడు. కానీ ప్రిన్స్ కూడా మాట తప్పాడు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా ‘గో గోవా గాన్’ మహేష్ మనస్సును మార్చేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డి.కే. కృష్ణ – రాజ్ నిడమూర్ ప్రతిభకు ఫిదా అయిపోయిన ఈ టాలీవుడ్ రాకుమారుడు వీరిద్దరి దర్శకత్వం లో సినిమా చేయడానికి పచ్చ జెండా ఉపాడని అది కూడా ఈ సంవత్సరమే ప్రారంభం అవుతుందనీ ఈ దర్సకద్వయం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రకటనతో  బాలీవుడ్ హీరోలలో చిన్నపాటి టేన్క్షన్ కలిగించక మానదు. ఎందుకంటే, యాడ్ ఫిలిమ్స్ ద్వారా దేశవ్యప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ అటు బాలీవుడ్ కు ఇటు టాలీవుడ్ కు హాట్ టాపిక్. ‘ఆగడు’ సినిమా పూర్తీ అయిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. యాక్షన్ ఓరియంటెడ్ కామిడీ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ నిర్మిస్తారని అంటున్నారు. రాను రానంటు మాటలు చెప్పిన ప్రిన్స్ మహేష్ కూడా మాట తప్పాడు కానీ ఈ విషయం ప్రిన్స్ అభిమానులకు శుభవార్తే...       

మరింత సమాచారం తెలుసుకోండి: