ముందుగా రక్తి వంటబట్టక పోతే తరువాత భక్తి అబ్బదని ఈ దర్శకుడికి బాగా తెలుసు.  అందుకే అమ్మాయిల అందాలను వెండితెర మీద చూపిస్తాడో, అంతకంటే అద్భుతంగా భక్తిరసాన్ని వెండితెర మీద ఆవిష్కరిస్తాడు. అతడే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు. ఎన్టీఆర్, కృష్ణ , చిరంజీవి వంటి ఆగ్రహీరోలతోనే కాదు కొత్త వారితోనూ సూపర్ హిట్లు కొట్టడం ఈ దర్శకుడి గొప్పతనం. ప్రేక్షకులను భయపెట్టడం, ఊహించలేని  కథ, కథనాలు, చిత్రాన్ని గజిబిజిగా నడపడం కె.రాఘవేంద్రరావు కు చేత  కాదు. సినిమాను సాదాసీదాగా నడిపిస్తూ వెండితెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించడం కె.రాఘవేంద్రరావు గొప్పతనం. సందేశాలు, ఉద్రేకాలు కలిగించడం చేయకుండా ధియేటర్ల కు వచ్చిన ప్రేక్షకుడుకి వినోదం పంచడం కె.రాఘవేంద్రరావు స్టైల్.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కె.రాఘవేంద్ర రావు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కృష్ణ జిల్లా కంకిపాడులో కె.రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. తండ్రి కె.ఎస్.ప్రకాశ్ రావు సుప్రసిద్థ సినిమా దర్శకుడు. శోభన్ బాబు హీరోగా నటించిన ‘బాబు’ సినిమాతో కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తరువాత వచ్చిన ‘జ్యోతి’, ‘కల్పన’, ‘ఆడవిరాముడు’ సినిమాలతో దర్శకుడిగా స్థిరపడ్డారు. ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘ఘరానా దొంగ’ ... వంటి ఎన్నో సూపర్ హిట్లు తీశారు. స్టార్ హీరోలతో సినిమాలు తీయడం, హీరోయిన్లను అందంగా చూపించడం కె.రాఘవేంద్ర రావు ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని ఆగ్రహీరోయిన్లు కూడా అతృతతో ఎదురుచూస్తుంటారు. ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలి బ్రహ్మాన్న’ వంటి సినిమాలు కె.రాఘవేంద్రరావు ప్రతిభకు నిదర్శనం.

స్టార్లు గా పేరుతెచ్చుకున్న చిరంజీవి - శ్రీదేవిలతో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ సినిమా తీసినా, కొత్తవారైన శ్రీకాంత్-దీప్తీ భట్నాగర్ లతో ‘పెళ్లి సందడి’ తీసినా వాటిని సూపర్ హిట్లు చేయడం కె.రాఘవేంద్రరావుకే చెల్లింది. కేవలం కమర్షియల్ సినిమాలు తీయడం మాత్రమే కాదు, విభిన్న తరహ సినిమాలు చేయడం కూడా రాఘవేంద్రరావు కు అలవాటు. కృష్ణంరాజు వంటి పక్కా మాస్ హీరో పెట్టి ‘త్రిశూలం’ చేయడం కె.రాఘవేంద్రరావు ధైర్యానికి నిదర్శనం.

ఇక ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘మంజునాథ’, ‘శిరిడిసాయి’ వంటి భక్తి చిత్రాలు తీసి ప్రేక్షకులు మెప్పించారు. త్వరలోనే ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమాతో కె.రాఘవేంద్రరావు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇక రాఘవేంద్రరావు బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. కొత్త హీరోను కె.రాఘవేంద్రరావు పరిచయం చేస్తే అతను స్టార్ హీరో అవుతాడని పరిశ్రమలో నమ్మకం. వెంకటేష్, మహేష్, అల్లు అర్జున్ ను హీరోలుగా ప్రేక్షకలకు పరిచయం చేసింది కె.రాఘవేంద్రరావు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అగ్ర దర్శకుడుగా రాణిస్తున్న రాజమౌళి రాఘవేంద్రరావు శిష్యుడు.

అలాగే, కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ సినిమారంగంలో రాణించడానికి కృషి చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: