ఎన్నో క‌ష్టాల‌ను, వ్యయ‌ప్రయాస‌ల‌ను చేకూర్చి త‌న‌యుడు సిల్వర్‌స్క్రీన్ ఎంట్రి కోసం శ్రీరామ రాజ్యం ప్రొడ్యూజ‌ర్ య‌ల‌మంచిలి సాయిబాబు ఎంతో ఖ‌ర్చు పెట్టాడు. త‌న ద‌గ్గర‌ ఎమౌంట్‌ లేకపోయినా అందివ‌చ్చిన ద‌గ్గర‌ డ‌బ్బుల‌ను అందిపుచ్చుకున్నాడు. ఇంటింటా అన్నమ‌య్య మూవీతో కొడుకు య‌ల‌మంచిలి రేవంత్ ను ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు చేతుల మీద‌గా శ్రీకారం చుట్టించాడు.

ఈ మూవీ రిలీజ్ ఈ నెల 31న ఉండ‌టంతో తండ్రి ప‌డ్డ క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కే రోజు అది. ఈ ఆశ‌ల‌పై క్రేజీ డైరెక్టర్ పూరిజ‌గ‌న్నాధ్ నీళ్ళుచ‌ల్లుతున్నాడు. అదే రోజు బ‌న్నీ,పూరీజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్నమూవీ ఇద్దర‌మ్మాయిల‌తో రిలీజ్ అవుతుంది. ఇంటింటా అన్నమ‌య్య,ఇద్దర‌మ్మాయిల‌తో  రిలీజ్‌ ఒకే రోజు కావ‌డంతో థియోట‌ర్లు, ప్రేక్షకుల కొర‌త యల‌మంచిలి మూవీకు ఎదుర‌వుతాయి.

మూవీ రిలీజ్ త‌రువాత తీసుకున్న డ‌బ్బుల‌ను తిరిగి ఇచ్చేద్దామ‌నుకున్న య‌ల‌మంచిలి సాయిబాబును ఇంటింటా అన్నమ‌య్య మూవీనే కాపాడాలంటున్నారు ఇండ‌స్ట్రీ ట్రేడ్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: