కమల్ హాసన్  గారాల  పట్టి శృతి హాసన్ గత కొన్ని  రోజులుగా వేడి వేడి వార్తలతో సందడి చేస్తోంది. మత్తెక్కించే ఫోటో షూట్లతో టాక్ ఆఫ్ ది  ఇండస్ట్రీగా మారింది. తండ్రి కమల్ హాసన్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈవెండితెర  సోయగం తెరపై ప్రతి విషయంలోనూ తన సొంత ముద్రను ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది. "గబ్బర్ సింగ్" విజయం తర్వాత వస్తున్న వరుస అవకాశాలను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో వరసగా సినిమాలు చేస్తోంది. స్వంత నిర్ణయాలతో చిన్న నాటి నుంచి పెరిగిన శృతి. తన కెరియర్ విషయంలో వేరొకరి జోక్య౦, ఏ మాత్రం ఇష్టపడదు .

ఇంట్లో తలపండిన సినీ మేధావులు ఉన్నా ఎవ్వరి అభిప్రాయాలు తీసుకోకుండా ,   ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలి అంటోంది. దీనివల్ల   తరువాత  ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా మనకు పెద్దగా బాధ ఉండదని,  అదే వేరొకరి అభిప్రాయానికి విలువనిచ్చి ఏదైనా  చేస్తే  అది సరైన ఫలితం ఇవ్వ కుంటే  అనవసరంగా వాళ్ళ మాట విని ఇలా జరిగింది అంటూ  బాధ  పడుతూ కూర్చోవాలి అది అవసరమా అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది.

తన  హాట్ హాట్ ఫోటో షూట్ గురించి మాట్లాడుతూ"గ్లామర్ ప్రపంచం ఈ మాత్రం  ట్రెండ్ కి తగ్గట్టుగా లేకుంటే యెవ్వడు చూస్తాడు అని అనడమే కాకుండా తనకు లేని భాద మీడియా కు ఎందుకు అంటూ రుస రుస లాడుతోంది.’” తన చిన్నతనంలోనే తల్లి సారిక తండ్రి కమల్ విడిపోయినా పరిస్థుతులకు ఎదురీదుతూ పెరిగిన మొండితనం శృతి మాటలలో చేతలలో స్పష్టంగా కనిపిస్తోంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: