మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా తాప్సీని చూసి టాలీవుడ్ కు మరో గ్లామర్ హీరోయిన్ దొరికిందని అందరూ అనుకున్నారు, అలాగే మంచు వారికుటుంబ సహకారంతో  తాప్సీచాలా అవకాశాలు కొట్టేసి ఒక దశలో ఈమె టాప్ హీరోయిన్ అయిపోతుందా అనే రేంజ్ కి ఎదిగిపోయింది.  కానీ ఆమె ఎంతో కష్టపడి అందాలు ఆరపోస్తున్నా సినిమాలు మటుకూ హిట్ కావడంలేదు.

తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గుండెల్లో గోదారి’, ‘షాడో’ సినిమాలు పరాజయం పొందాయి. ఈ పరిస్థుతులలో తెలుగులో గోపీచంద్ తో చేస్తున్న ‘సాహసం’, లారెన్స్ తో చేస్తున్న ‘మునీ-3’ తప్పా ఆమె చేతిలో చెప్పుకో తగ్గ సినిమాలు లేవు. ఈ రెండు సినిమాలు కూడా పరాజయం పాలు అయితే టాలీవుడ్ నుండి తట్టా బుట్టా సద్దుకోవడం తప్పా తన పరిస్థితి ఏమిటో అంటూ బెంగ తో నిద్ర లేని రాత్రులు గడుపుతోందట ఈ సుందరి. పాపం తాప్సీ కష్టాలు తీరేనా.....   

మరింత సమాచారం తెలుసుకోండి: