సూపర్ స్టార్ గా అశేష అభిమానులను దక్కించుకున్న రజనీకాంత్ కొత్త అవతారం ఎత్తారు. తన కొత్త సినిమా కోసం గాయకుడిగా మారారు. తొలిసారిగా హిందీలో పాట పాడారు. తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ ప్రస్తుతం ‘కొచ్చాడియాన్’ అనే సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం రజనీకాంత్ పాట పాడారు. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది చిత్ర యూనిట్ అంటుంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలను సమకూరుస్తున్నారు.

కాగా, ఈ ‘కొచ్చాడియాన్’ సినిమాను తెలుగు లో ‘విక్రమసింహ’ పేరుతో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: