అందాల తార నమిత తగ్గడం లేదు. తన మాటను నిలబెట్టుకోవడం లేదు. మొదట్లో సన్నాగా నాజుగ్గా ఉండే నమిత తరువాత బొద్దుగుమ్మగా మారింది. బొద్దుగుమ్మలు నెత్తిన పెట్టుకునే తమిళ తంబీలు ఆమెను విపరీతంగా ఆరాధించారు. ఆమె కోసం గుడి కూడా కట్టారు. ఆమెకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తరువాత నమిత మరింతగా లావుగా తయారయ్యింది. ఆమె ఆకారం మీద అనేక విమర్శలు వచ్చాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సన్నిహితులు ఆమెకు సలహాలు ఇచ్చారు.

ఈ క్రమంలో బొద్దుగుమ్మ నమిత సన్నబడ్డానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె కూడా యోగా, వ్యాయామాలు మీద దృష్టి పెట్టినట్లు చెప్పుకుంది. అయితే నమిత ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో నమిత ఈ విధంగా దర్శనమిచ్చింది. తన బొద్దుతనం తో అందరి దృష్టిని ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: