అక్కినేని నాగేశ్వర రావుతో ఇదివరకు తీసిన  "ఏడంతస్తుల మేడ"ని అయన తనయుడు నాగార్జునతో ఇప్పుడు రీమేక్ చేయాలనేది దాసరి నారాయణరావు ఆలోచన. అందులో  భాగంగానే ఆ సినిమా సీడీని నాగార్జునకి అందజేశారు దాసరి. ఓసారి చూసి నీ అభిప్రాయమేమిటో చెప్పమన్నారు. అయితే నాగ్ మాత్రం ఆ ప్రతిపాదనకి ఇప్పటిదాకా ఎస్ అని చెప్పలేదు. నో అనీ చెప్పలేదు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో ఇదే విషయం గురించి నాగార్జునని అడిగితే... "అవును దాసరి గారు సీడీ ఇచ్చి పంపారు. ఆ సినిమాని నేను ఇంకా చూడలేదు" అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.

అసలు విషయం ఏమిటంటే... ఆ సినిమాని చేయడం నాగార్జునకి అస్సలు ఇష్టం లేదట. రిమేక్ సినిమా అంటేనే నాగ్ కి సరైన అభిప్రాయం లేదట. అందుకే ఆయన "ఏడంతస్తుల మేడ"లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఇదే విషయాన్ని నాగ్ తన సన్నిహితులతో చెబుతున్నాడట. నాగార్జునని బుట్టలో వేసుకోవాలని దాసరి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. "తడాఖా" సినిమా సక్సెస్ సాధించిందని చెప్పి నాగ్ తనయుడు నాగచైతన్యని ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించాడు. దాసరి చేసిన ఈ ప్రయత్నాలన్నీ వృధా అయినట్టేనని చిత్ర పరిశ్రమలో సరదాగా చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: