ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో న‌ర్తించే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైనా వ‌ద్ద‌నుకొంటారా? ఐయామ్ సారీ, మ‌రొక‌రిని చూసుకోండి. అని చెప్తారా?  కానీ అన‌సూయ మాత్రం నో అనేసింది. దాంతో అత్తారింటికి దారేది యూనిట్‌తో స‌హా, చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తం ఖంగుతింది. ఏమిటి? అన‌సూయ బంగారంలాంటి అవ‌కాశం వ‌దులుకొంది?  అని ముక్కున వేలేసుకొన్నారు. అయితే దానికీ ఓ రిజ‌నుంది. అనసూయ ఉత్తినే ఈ సినిమా వ‌దులుకోలేద‌ట‌. ఈ ఛాన్స్ దొర‌క‌బుచ్చుకోవాల‌నే అనుకొంది. అయితే ఒక్క విష‌యంలో మాత్రం ఆమె వెనుక‌డుగు వేసింద‌ట‌. అదే డాన్స్‌!

అత్తారింటికి దారేదిలో అన‌సూయ‌తో ఓ మాంఛి మాస్ నెంబ‌ర్‌కి డాన్స్ చేయాంచాల‌నేది త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌. దేవీ మాస్ బీట్ అన‌గానే రెచ్చిపోతాడు. అలాంటి పాటే కంపోజ్ చేశాడు. అయితే అన‌సూయ‌కు స‌రిగా డాన్స్ రాదు. ఆమెకు డాన్స్‌లో ముంద‌స్తు శిక్ష‌ణ ఏమాత్రం లేదు. తెలియ‌ని విష‌యంలో వేలు పెట్టి.. వ‌చ్చిన పేరు పాడుచేసుకోవడం అన‌సూయ‌కు ఇష్టం లేదు. దానితో పాటు... ఇటీవ‌ల గుత్తాజ్వాల మాస్ నెంబర్ కూడా గుర్తొచ్చి ఉంటుంది. అందులో వ‌చ్చీ రాని డ‌న్స్‌తో గుత్తా అంద‌రినీ గాభ‌రా పెట్టింది. గుత్తాకు ఇలాంటి పాట‌లెందుకు అని అంద‌రూ హేళ‌న చేశారు. అలాంటి ప‌రిస్థితి త‌న‌కు రాకూడ‌ద‌ని అన‌సూయ భావించింద‌ట‌. అందుకే ఈ పాట చేయ‌న‌ని సున్నితంగా చెప్పింది. మొత్త‌మ్మీద ఓ మంచి నిర్ణ‌య‌మే తీసుకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: