తన అందచందాలతో పుష్కరకాలానికి పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కథానాయిక...  స్నేహ. అమ్మడికి దక్షిణాదిలో మంచి అభిమానగణం ఉంది. ఆ మధ్య తమిళ నటుడు ప్రసన్నని వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు దూరమైంది. మరో పక్క కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. స్నేహ  త్వరలో నిర్మాతగా మారబోతోంది. ఇప్పటికే కథ, తారాగణం అన్నీ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు మంచి దర్శకుడి కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. తనకున్న పరిచయాల ద్వారా ప్రతిభ గల దర్శకుడిని వెదికి పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. 

కథానాయికగా మంచి మంచి సినిమాల్లో నటించింది స్నేహ. నటిగా కొనసాగుతున్నప్పుడే కథలను ఎంపిక చేసుకోవడంలో ఆమె  ప్రత్యేకత కనిపించేది. ఇప్పుడు స్వయంగా నిర్మాణ రంగంలోకి దిగుతోంది కాబట్టి కథ, కథనాలపై మరింతగా కసరత్తు చేసి ఉంటుందని భావిస్తున్నారు. మరి స్నేహ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: