ఇద్ద‌ర‌మ్మాయిల‌తో టైమ్ బాలేదు. పెద్ద హీరో, క్రేజీ ప్రాజెక్టు అనే పేరు త‌ప్ప‌.... అనుకొన్న‌వేమీ స‌వ్యంగా జ‌ర‌గ‌డం లేదు. ఈ సినిమా ఇప్ప‌టికే రెండుసార్లు వాయిదా ప‌డింది. ఈనెల 31న వ‌చ్చేస్తున్నాం.. అని చెబుతున్నా  ఆ రోజు కూడా వ‌చ్చేది అనుమాన‌మే. ఎప్పుడైతే ఇన్ని వాయిదాలు వేసుకొందో ఈసినిమాపై ఊహించ‌ని నెగిటీవ్ టాక్ క‌మ్ముకొంది. ఫైన‌ల్ అవుట్ పుట్ స‌క్ర‌మంగా లేద‌ని - రీషూట్ చేశార‌ని చెప్పుకొన్నారు. అంతేనా..? ఈ సినిమాలో ప్రేమ కంటే, క్రైమ్ ఎక్కువైంద‌ని ఇది ల‌వ్‌స్టోరీ కాద‌ని, క్రైమ్ క‌థ‌ని కూడా అనుకొంటున్నారు.

లేటెస్టు న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాని అల్లు అర‌వింద్ చూశార‌ట‌. అయ‌న‌కూ అమ్మాయిలు న‌చ్చ‌లేద‌ని స‌మాచారం. దాంతో ఈ సినిమా ఏమైపోతుందో అనే బెంగ ప‌ట్టుకొందాయ‌న‌కు. కొడుకు సినిమాక‌దా??  ఆ మాత్రం భ‌యం ఉంటుంది. దాంతో పూరి మ‌ళ్లీ ఈ సినిమాకి మార్పులు చేర్పులూ చేయాల‌ని భావిస్తున్నాడు. చివ‌రికి అతుకుల బొంత‌లా త‌యార‌వుతుందేమో??

Click Here For iddarammayilatho Latest Gallery :

మరింత సమాచారం తెలుసుకోండి: