రాంగోపాల్ వ‌ర్మ‌కు ఇప్పుడు అర్జెంటుగా బ‌య్య‌ర్లు కావాలి. త‌న‌ను న‌మ్మి ఇంకా సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు ముంద‌కొస్తున్నా - బ‌య్య‌ర్లు మాత్రం వ‌ర్మ పేరు చెప్ప‌గానే గ‌జ గ‌జ వ‌ణికిపోతున్నారు. వ‌ర్మ ఇచ్చిన షాక్‌లు అలాంటివి. వ‌ర్మ నుంచి ఈ నాలుగేళ్ల‌లో చాలా సినిమాలొచ్చాయి. అందులో ఒక్క‌టి కూడా బ‌య్య‌ర్లుకు లాభాలు కాదు క‌దా.. క‌నీసం పెట్టుబ‌డిని కూడా తీసుకురాలేక‌పోయాయి. అన్నింటికంటే పెద్ద దెబ్బ‌... క‌థ స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అప్ప‌ల్రాజుతో త‌గిలింది. దాంతో బ‌య్య‌ర్ల గూబ గుయ్ మంది. ఆ సినిమా దెబ్బ‌తో వ‌ర్మ పేరెత్తితేనే బ‌య్య‌ర్లు హ‌డ‌లిపోతున్నారు. ఈ ప్ర‌భావం ఇప్పుడు స‌త్య 2పైనా ప‌డింది.

అస‌లే.. వర్మ క్రేజ్ సినిమా సినిమాకీ పాతాళానికి ప‌డిపోతోంది. దానికితోడు.. శ‌ర్వానంద్‌కి సరైన సినిమాల్లేవీ మ‌ధ్య‌. దాంతో బ‌య్య‌ర్లు ఈ సినిమాని మ‌రీ లైట్ తీసుకొన్నారు. అందుకే ఇప్పుడు వ‌ర్మ ఏదో ఓ వివాదాన్ని సృష్టించాల‌నే ప‌నిలో ప‌డ్డాడు. సినిమాల కోసం లేని వివాదాన్ని బ‌య‌టకు తీసుకొచ్చి త‌న సినిమాకి ఫ్రీ ప‌బ్లిసీటీ ఇచ్చుకోవ‌డం వ‌ర్మ‌కి అల‌వాటైన వ్య‌వ‌హార‌మే. దాంతో... ఏ తీగ‌ను ప‌ట్టుకొంటే త‌న సినిమా బండి ముందుకు క‌దులుతుందా?  అని ఆలోచిస్తున్నాడు. టాలెంటును న‌మ్ముకోకుండా... ప‌బ్లిసిటీ కోసం సినిమాలు తీస్తే ఇలాగే ఉంటుంది మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: