2012 నుండి 2013 ఏప్రిల్ నెల రిలీజ్ అయిన పెద్దహీరోలు,క్రేజి కాంబినేషన్ మూవీల బాక్సాపీస్ చిట్టా బ‌య‌ట‌కు వ‌చ్చింది. టాలీవుడ్ బాక్సాపీస్‌కు ఎవ‌రైతే వెన్నుముకగా నిలుస్తారో, అటువంటి హీరోల వ‌ళ్ళే థియోట‌ర్లు,ఎగ్జిబిట‌ర్లు,డిస్ట్రిబ్యూట‌ర్లకు దాదాపు 100 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని అంచ‌నా వేశారు. మొత్తంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లాభాల్లో కంటే న‌ష్టాల్లోనే బండి లాగేస్తుంది.


2012లో వ‌చ్చిన బాల‌కృష్ణ,జూనియ‌ర్ ఎన్టీఆర్‌,ర‌వితేజ‌,ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌,నాగార్జున‌,వెంక‌టేష్‌,రామ్ ఇలా పెద్దహీరోలే కాకుండా క్రేజీ కాంబినేష‌న్లు కూడ బాక్సాపీస్‌ను త‌న్నేసాయి. దీంతో థియోట‌ర్లకు అపార న‌ష్టం చేకూరింది.

2012 నుండి వ‌చ్చిన మూవీలు  బాల‌కృష్ణ అధినాయ‌కుడు,జూ.ఎన్టీఆర్ ద‌మ్ము,బాద్షా(మొద‌ట్లో  ఊపును కొన‌సాగించినా థియోట‌ర్లకు పెట్టిన వాటిని తీసుకురాలేక పోయింది), ర‌వితేజ మూవీలు నిప్పు,ద‌రువు,దేవుడు చేసిన మ‌నుషులు, నాగార్జున మూవీలు ఢ‌మ‌రుకం,గ్రీకువీరుడు,  వెంక‌టేష్ మూవీ షాడో, భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఊ కొడ‌తార ఉలిక్కి ప‌డ‌తారా, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మూవీ కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, న్యూ లుక్స్‌తో వ‌చ్చిన మూవీలు మిస్టర్ పెళ్ళికొడుకు,ఒంగోలు గిత్త.

ఈ మూవీలే కాకుండా టాలీవుడ్‌కు న‌ష్టాన్ని తెప్పించిన తెలుగు మూవీల విలువ 100 కోట్లు అని తేల్చేసింది. ఇండ‌స్ట్రీను కాపాడాల్సిన హీరోలే త‌ప్పుడు స్టోరిల‌తో రాంగ్ ట్రాక్‌లోకి వెళుతుంటే వీళ్ళనే న‌మ్ముకున్న ఎగ్జిబిట‌ర్లు,డిస్ట్రిబ్యూట‌ర్లు,థియోట‌ర్లు ఏమ‌వ్వాల‌ని మిలియ‌న్ డాల‌ర్ ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: