ఇటీవల కాలంలో ఐశ్వర్యారాయ్ వెండితెరకు దూరంగా ఉంది. పైగా ఒక చిన్నారికి తల్లి కూడా అయ్యింది. అమె శరీరాకృతి బాగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆమె వెండితెర మీద రాణించగలదా.., కొత్త అందాల భామల పోటీని తట్టుకోగలదా.. అనే సందేహాలు కొంతమంది నుంచి వ్యక్తం అయ్యాయి. వీటన్నింటికీ ఐశ్వర్యరాయ్ తాజాగా సమాధానం చెప్పింది.

కేన్స్ లో జరుగుతున్న చిత్రోత్సవంలో ఐశ్వర్యరాయ్ సందడి చేస్తుంది. తన అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలా వైరటీ డ్రెస్ లతో మెప్పిస్తుంది. తనలో ఇంకా వేడి తగ్గలేదని నిరూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: