ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయిన అంజలి గత సంఘటనలను మరిచిపోయినట్లుంది. మన  తెలుగు సీతమ్మ సినిమా హీరోయిన్ అంజలి కొద్ది రోజుల క్రితం అటు పోలీసులతోను, ఇటు మీడియాతోనూ  దోబూచులాడిన సంగతి తెలిసిందే. అంజలి అప్పుడు దర్శకుడు కలంజియం, తన పిన్ని భారతీదేవీ తనను నిలువెల్లా దోచేశారని, చంపుతానని బెదిరించారని ఆ సమయంలో అంజలి ఆరోపణలు చేసింది. దీనిపై దర్శకుడు కలంజియం మాద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్త పరిచిందట.

అంతేకాదు  పరువు నష్టం కేసు విచారణకు అంజలి హాజరు కాకపోవడంపై మండిపడింది. అంతేకాదు అంజలి జూన్ 5న తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని కోర్టు గతంలో అంజలికి నోటీసులు జారీ చేసింది. అయినా, ఈ రోజు విచారణకఆమె హాజరు కాలేదు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5న విచారణకు హాజరు కావాలని కఠినంగా ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. మీడియాతో నిర్మాతలతో ఆటలాడుకున్నంత సులువు కాదు, న్యాయస్తనాలతో వ్యవహారం. ఈ సత్యాన్ని గ్రహించి, అంజలి న్యాయస్థానాలను గౌరవిస్తుందా లేదా అన్నది చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: