స్వామిరారా సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆక‌ట్టుకొన్న దర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ. ప‌రిమిత వ‌న‌రుల‌తో ఈ సినిమాని క్వాలిటీగా తెర‌కెక్కించిన విధానం అందరికీ న‌చ్చింది. అంతేకాదు.. చాలా సినిమాల్ని చూసి కాపీ కొట్టా.. అని గ‌ర్వంగా చెప్పుకోడంలో అత‌ని నిజాయ‌తీ న‌చ్చింది. దాంతో పెద్ద హీరోలు కూడా సుధీర్‌కి ఫోన్ చేసి అభినందించారు. కొంత‌మంది నిర్మాత‌లు టోకెన్ అడ్వాన్సులు చేతిలోపెట్టారు.

ఇప్పుడు సుధీర్ త‌న రెండో సినిమాని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. నారా రోహిత్‌తో రెండో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేసుకొంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి రోహిత్ - సుధీర్ వర్మ‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. సుధీర్ క‌థ రోహిత్‌కి న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్టు దాదాపుగా ఓకే అయిపోయింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: