ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైడ్స్ లో ఒక బాబు తెగ హడావిడి చేస్తున్నాడు. ఆ బాబు ఎవరు అనుకుంటున్నారా? అతడే సంపూర్ణ బాబు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఒకేఒక్క పోస్టర్ తో ఫేస్ బుక్ లోనూ ట్విట్టర్ లోనూ ఎంతోమంది అభిమానులు (అసహ్యంచుకునే) వారిని, సంపాదించుకున్న సంపూర్నేష్ బాబు రాజమౌళి పెట్టిన ఒకేఒక్క ట్విట్టర్ తో సెలెబ్రిటీగా మారిపోయాడు.

 ప్రస్తుతం ‘హృదయం కాలేయం’ అనే సినిమాలో ఇతడు నటిస్తున్నాడు. కనీసం కమెడియన్ పాత్రలకు కూడా పనికిరాని ఇతడు, హీరో ఏమిటి బాబూ అని నెటి జన్స్ గగ్గోలు పెడుతున్నా, రాష్ట్ర స్థాయి లో ఇతడి పేరున సంపూర్నేష్  బాబు పేరిట యువజన సంఘాలు ఎర్పడిపోవడం. ప్రముఖ చానళ్ళలో ఇతని ఇంటర్యూలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇంత హడావిడికి మన తెలుగు సినిమా జేక్కన్న ఇచ్చిన ఒకేఒక ట్విట్టర్ అనుకోవాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: