ఆండ్రియా.. ఇది వ‌ర‌కు గాయ‌నిగా పేరు తెచ్చుకొంది. ఆ త‌ర‌వాత వెండితెర‌పై సంద‌డి చేస్తోంది. విశ్వ‌రూపం సినిమా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను తెగ న‌చ్చేసింది. ఇప్పుడు త‌డాఖాతో తెలుగు వారికి మ‌రింత ద‌గ్గ‌రైంది. `ఆండ్రియాతో న‌టించాల‌ని వుంది..` అని నాగార్జున సైతం చెప్పాడంటే... ఆమెలోని టాలెంట్ ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే త‌న గోల్ మాత్రం ర‌జ‌నీకాంత్‌తో న‌టించ‌డ‌మే అట‌.

ఆండ్రియా త‌న మ‌న‌సులోని మాట చెబుతూ ''ర‌జ‌నీసార్‌తో ఒక్క ఫ్రేమ్‌లో అయినా క‌నిపించాల‌ని ఉంది. ఆయ‌నంటే అంత అభిమానం. చిన్న పాత్ర అయినా చాలు. ఎన్ని సెక‌న్లు చేశా?  అని కూడా ఆలోచించ‌ను..'' అంటోంది. మ‌రి ర‌జ‌నీకాంత్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: