బూతు సినిమాల ద‌ర్శ‌కుడిగా మారుతి బ్రాండ్ ప‌డిపోయింది. నిర్మాత‌గానూ అదే పంథాలో వెళ్తున్నాడాయ‌న‌. మారుతి నిర్మాగా ఒక ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తెర‌కెక్కింది. మారుతి సినిమాల‌కు ఛాయాగ్ర‌హ‌కుడిగా ప‌నిచేసిన ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అన్న‌ట్టు క‌థ‌, స్ర్కీన్ ప్లే, మాట‌లు కూడా మారుతే చూసుకొన్నాడు. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ఆయ‌న‌దేన‌ట‌. దాంతో ఇది మ‌రో బూతు సినిమాగా మారింది. ఈ సినిమా ఇటీవ‌లే సెన్సార్ ముందుకు వెళ్లింది. వాళ్లేమో ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు.

దాంతో మారుతి మ‌ళ్లీ బూతు సినిమా తీశాడ‌హో... అంటూ ప్ర‌చారం ఊపందుకొంది. దీన్ని కూడా మారుతి ప‌బ్లిసిటీ కోసం వాడుకోవాల‌ని చూస్తున్నాడు. ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్ సినిమాల‌కు ఇలాగే ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. వాటికి బాగా సొమ్ములొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకీ కాసుల వ‌ర్షం కురుస్తుంద‌ని మారుతి తెగ సంతోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: