అతనొక్కడే త‌ప్ప త‌న కెరీర్ లో మ‌రో హిట్ కొట్టని క‌ళ్యాణ్ రామ్ ఇపుడు ఓం అనే త్రి డి యాక్షన్ ఫిల్మ్ తో వ‌స్తున్నాడు. ఛాయాగ్రాహ‌కుడు సునీల్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమాపైనే క‌ళ్యాణ్ త‌న ఆశ‌ల‌న్ని పెట్టుకున్నాడు. ఆశ‌లే కాదు డ‌బ్బు పెట్టాడు. దాదాపు త‌న‌కు వున్నదాంట్లో స‌గం డ‌బ్బు పెట్టి మరీ సినిమా తీశాడు. జీవితంలో ఎదురైన అనుభ‌వాల నుండి ఓ యువ‌కుడు ఎలా మారాడు...?అస‌లు జీవితంలో ఏం సాదించాడు అనే కాన్సెప్ట్ తో ఓం రూపొందింద‌ట‌.
అయితే అంతా బాగానే వుందిగానీ ఈ సినిమాలో హీరోయిన్ల విష‌యంలో క‌ళ్యాణ్ రామ్  కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది అని కొంద‌రు అంటున్నారు. ఈ మూవీలో అత‌డికి జోడిగా కృతిక‌ర్భంధా, అమీషాప‌టేల్ న‌టించారు. కృతి ఖాతాలో ఉన్నవ‌న్నీ ప్లాప్సే. ఇక నికిషా ప‌టేల్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఎంట్రీ ఇచ్చిన  కొమ‌రం పులితోనే వెన‌క్కి వెళ్లిపోయింది.
మ‌రి ఇంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న  సినిమాలో ఈ ప్లాప్ హీరోయిన్స్ ఎందుకు...?ఐర‌న్ లెగ్స్ అని పేరు తెచ్చుకున్న ఈ భామ‌ల‌తో క‌ళ్యాణ్ రామ్ చేస్తోన్న  ప్రయోగం ఫ‌లిస్తుందా అన్నది ఫిల్మ్ న‌గ‌ర్ వాసుల‌ను వేదిస్తున్న ప్రశ్న.
 

మరింత సమాచారం తెలుసుకోండి: