టాలీవుడ్ కు ఈ సంవత్సరం కలిసి వచ్చిన, కలిసి రాకపోయినా మన టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో మాత్రం బడా క్రేజ్ ఏర్పడింది. మన టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ గా చరిత్ర సృష్టించిన ‘సింహా’, ‘దూకుడు’, ‘కాంచన’, ‘ఇంద్ర’, లాంటి సినిమాలపై బాలీవుడ్ బిగ్ హీరోల దృష్టి పడింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి ప్రముఖ హీరోలు ఈ సినిమాలను హిందిలో రీమేక్ చేసే పనిలో పడ్డారు. అంతే కాకుండా బాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద ప్రొడక్షన్ హౌస్ లుగా చలామణి అవుతున్న రెలియన్స్ సినిమా, యూటివి లాంటి సంస్థలు ఈ సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థలతో ఈ సినిమాల రైట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు.
 టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’ సినిమాగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన తరువాత ఒకే సారి మన తెలుగు సినిమాల పై బాలీవుడ్ దృష్టి పడింది. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలకు నడుస్తున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మన నిర్మాతలు మాత్రం తమకు ఈ రీమేక్ సినిమాలలో వాటాలు కావాలి కానీ లక్షలు వద్దు అని అంటున్నారట. వైజయంతీ మూవీస్, 14 రీల్స్ లాంటి నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకుని తమ బ్లాక్ బస్టర్ సినిమాలకు కోట్లు కొల్ల కొడదామని మాస్టర్ ప్లాన్ రచిస్తున్నారని తెలుస్తోంది....

మరింత సమాచారం తెలుసుకోండి: