1993 ముంబాయ్ బ్లాస్ట్‌లో సంజ‌త్‌ద‌త్ జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు. త‌ను జైలుకు వెళ్ళాడో లేదో, అప్పడే ఆనాటి బాంబ్ బ్లాస్ట్ మీద ఓ స్టోరి సిద్ధమైంది. రిలీజ్‌కు కూడ ర‌డీ అవుతుంది.

జులై 19న రిలీజ్ అవుతున్న ఈ మూవీలో శృతిహాస‌న్ ఓ రోల్‌లో న‌టించింది. అవును శృతిహాస‌న్ పాకిస్థాన్ ప్రాస్టిట్యూడ్‌గా క‌నిపిస్తూ వ‌స్తున్న మూవీ డి-డే. ఈ మూవీ 1993లో జ‌రిగిన ముంబాయ్ బ్లాస్ట్స్ మీద తీసిందేన‌ని ద‌ర్శకుడు నిఖిల్ అద్వాని చెప్పాడు. ఈ బ్లాస్ట్స్ నా జీవితాన్నే మార్చేశాయి. ఆనాటి నుండి నేటి వ‌ర‌కూ న‌న్ను వెంటాడుతూ వ‌చ్చింది ఆ ఘ‌ట‌న అంటూ, డైరెక్టర్ డి-డే స్టోరీను రివీల్ చేశాడు.

సెక్సీ పోస్టర్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన శృతిహాస‌న్ విమ‌ర్శన‌ల పాల‌వుతుంటే, ఇప్పుడు ఈ మూవీ బ్లాస్ట్స్ నేప‌థ్యం అని బ‌య‌ట‌కు తెలియ‌డంతో, డి-డేకు ఎక్కడ‌లేని హైప్ వ‌చ్చేసింది బి టౌన్‌లో. సంజ‌య్‌ద‌త్ జైలుకు వెళ్ళడం, ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన మూవీలో ఓ కేర‌క్టర్ చేయ‌టం శృతికు క‌లిసొచ్చిన విషయం అని తెగ ఖుషీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: