త‌డాఖా సినిమాతో తొలి విజ‌యం అందుకొన్నాడు డాలీ.  చాలా సినిమాల త‌ర‌వాత నాగ‌చైత‌న్య‌కూ ద‌క్కిన హిట్ ఇది. `చైతూకి స‌రైన సినిమా ప‌డ‌లేదు..` అని దిగులుగా ఉన్న నాగ్‌....కి ఆ బెంగ తీర్చాడు డాలీ. అందుకే డాలీతో సినిమా చేయ‌డానికి నాగ్ ఉత్సాహం చూపించాడు. కొడుక్కి హిట్ ఖాయ‌మైన వెంట‌నే `మంచి క‌థ తెచ్చుకో. సినిమా చేద్దాం.` అనే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేశాడు నాగ్‌.  

భాయ్ షూటింగ్ ఐస్ లాండ్‌లో ముగించుకొని ఇటీవ‌లే న‌గ‌రానికి వ‌చ్చాడు నాగ్‌. వ‌చ్చీరాగానే డాలీ త‌న ద‌గ్గ‌రున్న  ఓ లైన్ చెప్పేశాడు. దీనికి నాగ్ కూడా ఒకే  చెప్పాడు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత‌. క‌థానాయిక‌గా ఆండ్రియా కూడా సెట్ అయిపోయింది. మ‌నం సినిమాతో పాటు.. ఈ కొత్త సినిమా కూడా స‌మాంత‌రంగా షూటింగ్ జ‌రుపుకొనే అవ‌కాశాలున్నాయి.

advertisements

నాగ్‌తో సినిమా చేయాల‌న్న త‌న ల‌క్ష్యం ఇప్ప‌టికి నెర‌వేరింద‌ని బెల్లంకొండ ఆనందంగా చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: