సూప‌ర్ హిట్ టాక్ నుంచి జ‌స్ట్ యావ‌రేజ్ టాక్‌కి ప‌డిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు బాద్‌షా. తొలి రోజు ఈ సినిమాకి హిట్ టాక్ వ‌చ్చింది. క్ర‌మంగా అది యావ‌రేజ్ స్థాయి ద‌గ్గ‌ర ఆగిపోయింది. కార‌ణాలు ఏమైనా ఎన్టీఆర్ మ‌రోసారి అభిమానుల అంచ‌నాలు నెర‌వేర్చే క్ర‌మంలో త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. రూ.50 కోట్లు వ‌సూలు చేస్తుంద‌నుకొన్న సినిమా రూ.40 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. అయినా 60 సెంట‌ర్ల‌లో 50రోజులు ఆడింది. అయితే ఈ సినిమాని... బ‌ల‌వంతంగా 50 రోజుల వైపు లాక్కొచ్చార‌ట‌. తొలి మూడు వారాల త‌ర‌వాత ఈ సినిమా వసూళ్లు దారుణంగా ప‌డిపోయాయి.


advertisements

అయినా స‌రే ఎన్టీఆర్ అభిమానులు, బండ్ల గ‌ణేష్ పంతం..ఈ సినిమాకి యాభై రోజుల మార్కు వైపుకు న‌డిపించాయి. కొన్ని థియేట‌ర్లు జ‌నం లేక ఖాళీగా ఉన్నా స‌రే - ఎదురు డ‌బ్బులిచ్చి న‌డిపించార‌ట‌. మొత్త‌మ్మీద బుడ్డోడి సినిమాని బాగానే లాక్కొచ్చారు. అయితే లాభం ఏముంది??  నిర్మాతకు మాత్రం డ‌బ్బులు మిగ‌ల్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: