స‌మంత‌...జెస్సీగా ఫ‌స్ట్ సినిమాతోనే అంద‌ర్నీ మాయ చేసి ...ఫ‌స్ట్ సినిమా సెట్స్ పై వుండ‌గానే..బృందావ‌నం..ఆ త‌రువాత దూకుడు ఇలా వ‌రుస ఆఫ‌ర్లు, వర‌స విజ‌యాలు అందుకున్న బ్యూటీ.  ప్రిన్స్ మాట‌ల్లో చెప్పాలంటే ఒంటిమీద కేజీ కండ లేకున్నా....భూమికి మూడు అడుగుల ఎత్తే వున్నా......స‌మంత ఏదో మాయ చేస్తుంది. ఆమె న‌టిస్తే చాలు ఆ సినిమా హిట్టే. ఆమె క‌నిపిస్తే ఆడియెన్స్ కు ఓ ధ్రిల్.

advertisements


ఇదే ఫీలింగ్ ప్రతి ప్రొడ్యుస‌ర్ కి క‌లుగుతుంది కాబ‌ట్టే హై రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారు. ఇదే ఫీల్ ఆడియెన్స్ కి   క‌లుగుతుంది కాబ‌ట్టే ఆమెను అభిమానిస్తున్నారు. అయితే స‌మంత అంత అంద‌గ‌త్తెను కాదంటోంది. నాకు అందం కంటే అదృష్టం బాగుంది. నిజంగా నేనేమీ అతిలోక సుంద‌రినీ కాను...నాకంటే అంద‌గ‌త్తెలు ఎంతో మంది మంది వున్నారు...కానీ ల‌క్ కార‌ణంగానే నాకు ఈ ఆఫ‌ర్లు...అభిమానం అంటూ చెప్పుకొస్తుంది స‌మంత‌. 

అయితే ఇక్కడ మ‌నం చెప్పుకోవాల్సిన విష‌యం ఏంటంటే అందం లేకున్నా...నేనే భూలోక సుంద‌రి అని గొప్పలు చెప్పుకునే భామ‌ల కంటే ....ఇలా టాప్ పొజిష‌న్ లో వుండి కూడా నేనేమీ అంత అంద‌గ‌త్తెను కాదు అని చెప్పే స‌మంత యాటిట్యూడ్ కే ఫ్యాన్స్ ఫిదా అయిపోయింది. ఆమె అవున‌న్నా..కాద‌న్నా...స‌మంత నువ్వే  మ‌న‌సంతా అని సిద్దుతో పాటు ఆడియెన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: