ఐటం సాంగ్ ఇపుడు ప్రతి సినిమాకు మ్యాన్ డెట‌రీ అయిపోయింది. అంతేకాదు ఐటం సాంగ్ చేస్తే హీరోయిన్ కంటే కూడా పాపులారిటీ వ‌చ్చేస్తుంది. అందుకే టాప్ హీరోయిన్స్ అని చెప్పుకునే భామ‌లు కూడా ప్రత్యేక గీతాల్లో స్టెప్స్ వేయ‌డానికి సై అంటున్నారు. ఇపుడు హాట్ బ్యూటీ ల‌క్ష్మీరాయ్ కూడా ఓ ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న బ‌లుపులో అమ్మడు ఐటం సాంగ్ చేయ‌బోతుంది. నిజానికి డ‌మ‌రుకం సినిమాకి కూడా లక్ష్మీరాయ్ ని  ఐటం సాంగ్ చేయ‌మ‌ని అడిగార‌ట‌. అయితే ఐట‌మా...నేనా...అని బిల్డప్ ఇచ్చింద‌ట  ఈ బొద్దుగుమ్మ . దాంతో ఆ ఐటం సాంగ్ ని ఛార్మి ఎగ‌రేసుకుపోయింది. ఆ త‌ప్పు మ‌ళ్లీ చేయద‌లుచుకోలేద‌ట ల‌క్మీ రాయ్. అందుకే డైరెక్టర్  మ‌లినేని గోపిచంద్  అడ‌గ‌గానే ఓకే అన్నద‌ట‌.
��
advertisements


వాస్తవానికి ఈ మ‌ద్య లక్ష్మీ రాయ్ కి అంత‌గా ఆఫ‌ర్లేమీ లేవు. త‌మిళంలో సిద్దుతో ఓ సినిమా త‌ప్ప ఆఫ‌ర్లు ఇచ్చే నాధుడు కూడా క‌న‌బ‌డ‌టం లేదు. అందువ‌ల్లే లక్ష్మీ రాయ్ త‌న బొద్దు అందాల‌ను ఐటం సాంగ్ లో ఆర‌బోయాల‌నుకుంటోంది. మ‌రి ఐటం సాంగ్ అయినా అమ్మడికి ఓ రెండు ఛాన్స్ లు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: