ప్రిన్స్ ..శ్రీనువైట్ల..  ఈ ఇద్దరి పేర్లు చెబితే ట‌క్కున దూకుడు..ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ గుర్తోస్తాయి. మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా  దూసుకెళ్తా అంటూ   ప్రిన్స్ పేల్చినా డైలాగ్స్.......శ్రీనువైట్ల వే టేకింగ్ ఆడియెన్స్ కి విప‌రీతంగా న‌చ్చి దూకుడుని ఓ రేంజ్ లో హిట్ చేశారు. మ‌ళ్లీ ఆ సినిమా త‌రువాత ఈ ఇద్దరి కాంబినేష‌న్ లో మూవీ ఎప్పుడా ప్రారంభం అవుతుందా అని ప్రిన్స్ ఫ్యాన్స్ చ‌కోర ప‌క్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఒక క‌న్ క్లూజ‌న్ ఇచ్చే టైం మొచ్చింది.
నిజానికి బాద్ షా త‌రువాత కోన వెంక‌ట్ విడిపోవ‌డం...శ్రీనువైట్ల క‌ధ రాసుకోలేడు అంటూ ప్రచారం జరిగే స‌రికీ ఈ ఇద్దరి కాంబినేష‌న్ లో తెరకెక్కాల్సిన ఆగ‌డు ఆగిపోయిన‌ట్టే న‌ని ఓ గాసిప్ హ‌ల్ చ‌ల్ చేసింది . కానీ ఆగడు స్క్క్రీప్ట్ పూర్తి అయింద‌ని ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుందని లెటెస్ట్ న్యూస్. . ప్రస్తుతం ఫ్రీ ప్రొడ‌క్షన్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంద‌ని ....ప్రిన్స్ కి జోడిగా ప‌రిణితీ చోప్రా న‌టిస్తుంద‌ని శ్రీనువైట్ల అంటున్నారు.

advertisements


14 ప్రేమ్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ సినిమా...సుకుమార్ డైరెక్షన్ లో   ప్రిన్స్ న‌టిస్తున్న సునామీ త‌రువాత కంటిన్యూగా  షూటింగ్ జ‌రుపుకోనుంది. సో దూకుడుతో ఇటు ప్రిన్స్,  అటు శ్రీనువైట్ల దూకుడు పెరిగింది. మ‌రి అదే దూకుడుని  బాక్సాఫీస్ ద‌గ్గర  ఆగ‌డుతో కంటిన్యూ చేస్తారా...?లేక ఆగిపోతారా అన్నది జ‌స్ట్ వెయిట్ అండ్ సీ.....
 

మరింత సమాచారం తెలుసుకోండి: