బుల్లితెరమీద హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను వెండితెర మీద కూడా రాణించాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించింది. ‘లీడర్’, ‘జులాయి’ వంటి సినిమాల్లో ఐటెం సాంగుల్లో నటించింది.

కాగా, ఉదయభాను ప్రస్తుతం ‘మధుమతి’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజ్  శ్రీధర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

advertisements


ఈ మధుమతి కథను ఎనిమిది సంవత్సరాల క్రితమే తయారు చేసుకున్నానని, ఉదయభానును దృష్టిలో పెట్టుకునే ఈ కథను తయారు చేసుకున్నానని ఆయన చెప్పారు. ఇక, ఈ ‘మధుమతి’ సినిమా గురించి ఆయన చెబుతూ విచ్చలవిడిగా తిరిగే ఓ యువతి కథతో ఈ ‘మధుమతి’ సినిమా తెరకెక్కుతుందని రాజ్ శ్రీధర్ చెప్పారు. విచ్చలవిడిగా తిరిగే ఓ యువతిని అనుకోని పరిస్థితుల్లో ఒక తమిళ యువకుడు తన ఇంటికి తీసుకెళ్లడంతో జరిగే పరిణామాలతో ఈ సినిమా వినోదభరితంగా సాగుతుందని ఆయన చెప్పుకున్నారు. ఆయన ఇలా చెబుతుండంతోనే అందరికీ ఆసక్తి ప్రారంభం అయ్యింది. ‘మధుమతి’ చిత్రకథ ఉదయభానును దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకున్నానని చెబుతున్న అతనే ఆ సినిమా విచ్చలవిడిగా తిరిగే ఒక అమ్మాయి కథతో రూపొందుతుందని చెబుతుండం ఆసక్తి కలిగిస్తుంది. ఉదయభాను విచ్చలవిడిగే తిరిగే అమ్మాయా... అనే సందేహం రాజ్ శ్రీధర్ మాటలు విన్నంటున్న వారికి కలుగుతుంది.

కాగా, ఈ మధుమతి సినిమాను గోమాత ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. శివకుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: