లాంగ్ షాట్  లో చూస్తే అతడు పక్కా విలన్ లా కనిపిస్తాడు, అతడి బాడీ లాంగ్వేజ్, అతని మాటలు అతని చూపులలోని తీవ్రత చూస్తే ఎవరైనా ఈ వ్యక్తికి మెంటలా అనుకుంటారు. అతడే ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన ఇల్లు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి పోసాని కృష్ణమురళి గారి ఇల్లు ఎక్కడా అంటే ఎవరు చప్పరట. కానీ మెంటల్ కృష్ణ ఇల్లు ఎక్కడా అంటే జనం వెంటనే చేపుతారట. పరుచూరి బ్రదర్స్ శిష్యుడిగా తెలుగు సినిమా రంగంలోకి వచ్చిన పోసాని రాసే మాటలు నటించే నటనా అన్నీ సంచలనమే.

 పోసాని పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమాలు ‘ఆపరేషన్ దుర్యోధన’, ‘మెంటల్ కృష్ణ’. ఆయన దృష్టిలో ప్రస్తుతం సినిమా ప్రపంచంలో రచయిత కూరలో కరివేపాకుల మరిపోయడనీ, నిర్మాతలు చుట్టూ దర్శకులు చుట్టూ తిరిగి తిరిగి స్క్రిప్ట్ రాసిస్తే డబ్బులు మాత్రం సినిమా ఫస్ట్ కాపీ వచ్చాకా ఇద్దాములే కంగారు ఏమిటి అంటూ ఉదాసీనంగా చూస్తారు. ఈ పరిస్థితిలో రచయిత నేగ్గుగు రావాలీ అంటే నోరు కూడా పెద్దదిగా ఉండాలనీ అంటారు పోసాని.

advertisements




ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాలలో రాణించి ఎన్నికలలో గెలవాలి అంటే డబ్బులు పంచాలి, జనానికి మందు పోయించాలి, కులాన్ని అడ్డం పెట్టుకోవాలి వీటితో పాటు సమర్ధవంతంగా డబ్బులు సంపాదించగల సమర్ధత ఉండాలి. ఈ లక్షణాలలో ఎవక్క లక్షణం లేకపోయినా, ఎంత మంచి వాడైన రాజకీయాలకు పనికిరాడు అని పోసాని అభిప్రాయం. నాయక్ సినిమాలో  పోసాని పాత్ర సూపర్ క్లిక్ అవ్వడంతో ప్రస్తుతం ఈ మెంటల్ కృష్ణ 30 సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్నాడు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే పోసనిలో రెబల్ యాంగిల్ ఉంది, హ్యుమర్ యాంగిల్ యాక్టింగ్ యాంగిల్ , పొలిటికల్ యాంగిల్ హ్యూమన్ యాంగిల్ ఇన్ని రకాల కలబోసిన వ్యక్తిత్వం రాయిలా కనిపించే పోసాని కృష్ణమురళి.....

మరింత సమాచారం తెలుసుకోండి: