గ‌బ్బర్ సింగ్....  ప‌వ‌న్ కెరీర్ లో  ఖుషీ, జ‌ల్సాల త‌రువాత మ‌ళ్లీ ఆ రేంజ్ హిట్. నాకు కొంచెం తిక్క వుంది కానీ దానికో లెక్క వుంద‌ని ప‌వ‌న్ చెప్పిన డైలాగ్స్ బాక్సాఫీస్ ద‌గ్గర కాసుల వ‌ర్షం కురిపించాయి. మ‌ళ్లీ గ‌బ్బర్ సింగ్ కి సీక్వెల్ చేస్తున్నామ‌ని ప‌వ‌న్ ప్రక‌టించ‌గానే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. మ‌రో బ్లాక్ బ‌స్టర్ వ‌చ్చేస్తుంద‌ని మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
నిజానికి గ‌బ్బర్ సింగ్ 50డేస్ డాట‌గానే గ‌బ్బర్ సింగ్-2కి మంచి లైన్ దొరికింద‌ని హ‌రిష్ శంక‌ర్ ఎనౌన్స్ చేశాడు. కానీ  గ‌బ్బర్ సింగ్-2 కి హ‌రిష్ శంక‌ర్ కి బ‌దులు సంప‌త్ నంది పేరు డైరెక్టర్ గా ఎనౌన్స్ చేయ‌గానే అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అంతేకాదు ఈ సినిమాకు స్టోరి  న్ కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణే చెప్పాడ‌ట‌. అత‌ని ఆద్వర్యంలోనే కధా చ‌ర్చలు సాగుతున్నాయ‌ట‌. దీంతో్ ఫ్యాన్స్ వ‌ర్రీ అవుతున్నారు.
��
advertisements


గ‌బ్బర్ సింగ్ ద‌బాంగ్ కి రీమేక్ అయిన‌ప్పటికీ ఆ మూవీతో సంబంధం లేకుండా హారిష్ శంక‌ర్ అద్బుతంగా క‌ధ రాశాడు. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బర్ సింగ్-2ని ఆ స్ధాయిలో రాయ‌ల‌గల‌డా.? ర‌చ్చ లాంటి రోటీన్ సినిమా తీసిన సంప‌త్ నంది గ‌బ్బర్2కి క‌రెక్ట్ గా యాండిల్ చేయ‌గ‌ల‌డా అన్నదే ప‌వ‌న్ ప్యాన్స్ ని వేదిస్తున్న ప్రశ్న. జాని లాంటి చెత్త సినిమాను డైరెక్ట్ చేసిన ప‌వ‌న్ కొంప‌దీసి గ‌బ్బర్ సింగ్-2ని చెడ‌గొట్టడు క‌దా...? ఏమో సినిమా వ‌స్తేగానీ రిజ‌ల్ట్ తెలియ‌దు అంటున్నారు కొంద‌రు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: