ఈ మ‌ద్య మ‌న హీరోలు గాన గంధ‌ర్వులుగా మారుతున్నారు. చిరు, ఎన్టీఆర్, శింబు,ప‌వ‌న్ క‌ళ్యాణ్ ....ఇపుడు ఆ లిస్ట్ లో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా చేరిపోయారు. మ‌ర్యాద రామ‌న్న కోసం వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన ర‌వితేజ బ‌లుపు సినిమాలో త‌న గొంతుని స‌వరించి ఓ సాంగ్ సింగేశారు. మొద‌ట పాట అన‌గానే నో చెప్పినా గోపిచంద్ మ‌లినేని , ధ‌మ‌న్ ఈ పాట మీరు పాడితే భ‌లే వుంటుంద‌ని చెప్పడం...ర‌వితేజ ట్రైల్ వేయ‌డం జ‌రిగింద‌ట‌. అలా ర‌వితేజ ప్రయ‌త్నించి ప్రయ‌త్నించి ర‌వితేజ అదిరిపోయేలా పాడార‌ట‌.

advertisements



ధ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ పాట ఈ మ‌ద్యే రికార్డ్ చేశార‌ట‌. ధ‌మ‌న్ తో క‌ల‌సి ర‌వితేజ ఆల‌పించిన ఆ పాట సూప‌ర్ గా వ‌చ్చింద‌ని మూవీ యూనిట్ అంటోంది. ర‌వితేజ‌కు జోడిగా శృతిహాస‌న్, అంజ‌లి న‌టించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ జూన్1న జ‌ర‌గ‌నుంది. సో ర‌వితేజ పాట వినాలంటే జూన్1 దాకా ఆగాల్సిందేన‌న్నమాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: