ఇండియ‌న్ సినిమాను అంత‌ర్జాతీయ స్ధాయిలో రెప‌రెప‌లాడించిన ద‌ర్శకుడు మ‌ణిర‌త్నం. ఒక రోజా...బొంబాయి..ద‌ళ‌ప‌తి....స‌ఖి. అన్ని సూప‌ర్ హ‌ట్సే. ఏ పాయింట్ ప‌ట్టుకున్నా....ఆడియెన్స్ ను సీటులోంచి క‌ద‌ల‌కుండా మ్యాజిక్ చేయ‌ల‌గ‌ల ఒన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం. అయితే కొద్దికాలంగా మ‌ణిర‌త్నంకి కాలం క‌లిసిరావ‌డం లేదు. రావ‌ణ్, క‌డ‌లి వ‌రుస‌గా బాక్సాఫీస్ ద‌గ్గర ప‌ల్టీలు కొట్టాయి. కొడితే కొట్టాయి....కానీ క‌డ‌లి ప్లాప్ కి కార‌ణం నువ్వేనంటూ మ‌ణి ఇంటిపై డిస్ట్రీబ్యూట‌ర్స్ దాడి చేయ‌డం ఆయ‌న‌ను తీవ్ర మ‌న‌స్తాపానికి గురి చేసింది. అందుకే త‌నేంటో మ‌ళ్లీ ప్రూవ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. . అందులో బాగంగా ఇండియా, పాక్ విడిపోవ‌డానికి కార‌ణాలను సందేశంగా చెబుతూనే ఓ క్యూట్ ల‌వ్ స్టోరి దానికి యాడ్ చేసి ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

advertisements - Call 040 4260 1008


ముందుగా ఈ సినిమాను షారుక్ తో చేద్దామ‌ని నిర్ణయించుకున్న మ‌ణి మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకుని మ‌ల్టీస్టార‌ర్ మూవీగా ఈ క‌ధ‌ను మ‌లిచాడ‌ట‌. అర‌వింద్ స్వామి, షారుఖ్ ఖాన్, కార్తీక్ న‌టించే ఈ సినిమాను త‌న బ్యాన‌ర్ లోనే భారీ బ‌డ్జెట్ తో రూపొందించ‌బోతున్నారు మ‌ణిర‌త్నం. ఇక ద‌ళ‌ప‌తి, ఇద్దరు, లాంటి మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ని అత్యద్బుతంగా తెరకెక్కించి స‌క్సెస్ అయిన మ‌ణిసార్ ఇపుడు మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ తో మ్యాజిక్ చేయ‌గ‌ల‌డో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: