ఎంత టాప్ హీరోయిన్స్ కు అయినా పెళ్ళి అయిపోతే క్రేజ్ తగ్గుతుంది అంటారు, అందుకే కొంత మంది హీరోయిన్స్ పెళ్ళి ఐనా ఆ న్యూస్ ను బయటకు రానివ్వకుండా తమ క్రేజ్ ను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతూ ఉంటారు. కానీ దీనికి పూర్తి మినహాయింపు బుల్లి తెర యాంకర్స్.

 పెళ్ళి అయిన వారిదే హవా, ఉదయభాను, సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తీ, ఈ మధ్యనే వచ్చి హాట్ యాంకర్ గా పేరుగాంచిన అనసూయ వీరంతా శ్రీమతులే. మరొక విషయం శ్రేయ, చార్మీ లకు తాను ఏమి తేసిపోను అంటూ యాంకర్ ఉదయ్ భాను వేశ్య పాత్ర ఛాయలు ఉన్న ‘మధుమతి’ గా రాబోతోంది అంటే వేశ్య పాత్ర తో పాటు యాంకర్స్ స్థాయి ఎంత పెరిగి పోతోందో అర్ధమవుతోంది.

హీరోయిన్స్ తో సమానంగా వీరి పారితోషికాలు కూడా లక్షలు మీదే ఉంటున్నాయి. మొన్న జరిగిన కళ్యాణ్ రామ్ ‘ఓం’ ఆడియో వేడుకలో

advertisements - Call 040 4260 1008
యాంకర్ అనసూయ చేసిన ఓవర్ యాక్షన్ చూసి దర్శకరత్న దాసరే తట్టుకోలేక  పోయాడంటే వీరు కూడా సినిమా హీరోయిన్స్ లా ఫీల్ అవుతున్నార అని అనిపిస్తుంది. కానీ సినిమాలో హీరోయిన్స్ కు పెళ్ళి తరువాత క్రేజ్ డౌన్, కానీ మన బుల్లి తెర యాంకర్స్ మాత్రం పెళ్ళి అయిన క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మరి అదేమిటో

మరింత సమాచారం తెలుసుకోండి: