వ‌స్తాడ‌నుకొన్న నంద‌మూరి బాల‌కృష్ణ ఓమ్ ఆడియో వేడుక‌కు రాలేదు. ఆయ‌నే కాదు... క‌ల్యాణ్ రామ్ కుటుంబ స‌భ్యులు త‌ప్ప‌... వేదిక‌పై పెద్ద‌లెవ‌రూ రాలేదు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఒక్క‌రే త‌ళుక్కున మెరిశారు. అతిథుల సంద‌డి లేదు.. అని దిగులు ప‌డితే అన‌సూయ త‌న అతితో వ‌చ్చిన అతిథులను ర‌ఫ్ఫాడించేసింది. ఈమ‌ధ్య తెగ పాపుల‌ర్ అయిపోయా... అనే ఓవ‌ర్ కాన్పిడెన్స్ త‌ల కెక్కిందేమో..?  వ‌చ్చీరానీ యాంక‌రింగుల‌తో వీక్ష‌కుల త‌ల బొప్పిక‌ట్టించింది. దానికి తోడు అదుర్స్ రఘు కూడా ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డంతో... ఈ ఫంక్ష‌న్‌కి ఎందుకొచ్చాంరా బాబూ.. అనుకొన్నారు అక్క‌డివాళ్లంతా.

అన‌సూయ ఇలాగే అతి చేసుకొంటూ పోతే...క్రేజ్ మాట దేవుడెరుగు...??  అన‌సూయ పేరు త‌ల‌చుకోవ‌డానికే జ‌నాలకు వ‌ణుకు పుట్టుకొస్తుంది.

advertisements - Call 040 4260 1008





మరింత సమాచారం తెలుసుకోండి: