మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న బన్నీ  ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారి అభిమాన హీరో సినిమా వస్తుంనందుకు ఆనందంగా ఉన్న లోలోపల మేగాభిమనులు ఒక విషయం పై భయపుతున్నారట. పూరి జగన్నాద్ గత సినిమాలను పరిశీలిస్తే ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చన పురీ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. U/A సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు అన్నీ పెద్దగా విజయవంతం కాలేదని సెంటిమెంట్ మెగా అభిమానులకు ఉన్నదట.

దీనికి ఉదాహరణగా గత సంవత్సరం U/A సర్టిఫికేట్ తో విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాల పరాజయాన్ని ఉదాహరణగా చుపెడుతున్నారు. దీనికి తోడు ఈ సినిమా కధ గురించి ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తలు మేగాభిమనులను మరింత భయ పెడుతున్నాయట. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కధ గతంలో తెలుగులో వచ్చిన ‘7/G బృందావన్ కాలనీ’’ ‘ఒంటరి’ సినిమాలను పోలి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలలో హీరో తన హీరోయిన్ చనిపోయినా బ్రతికి ఉందనే బ్రమలో బ్రతుకుతాడు.

advertisements - Call 040 4260 1008


అదే విధంగా ఈ సినిమాలో కూడా బన్నీ ఒక అమ్మాయి చనిపోయినా  బ్రతికి ఉందనే నమ్మకంతో బ్రతుకుతూ ఉంటాడట. ఈ మధ్యలో మరో అమ్మాయి బన్నీకి పరిచయం అవడంతో కధలో ట్విస్ట్ లు వస్తాయని అంటున్నారు. ఈ వార్తలు వింటున్న మెగా అభిమానులు మరింత భయపడి పోతున్నారట. ఇంత హడావిడి చేసి పూరి పాత సీసాలో కొత్త నీరుగా ఈ  ‘ఇద్దరమ్మాయిల’ను చూపెడతాడా అని మెగా అభిమానులకు భయమట. పూరీ మాత్రం ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని వరస పెట్టి ఇంటర్వ్యూలు యిస్తున్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: