ఎన్టీఆర్, అక్కినేని లతో సమానంగా ప్రజాధరణ పొందిన నటుడు ఎస్వీఆర్. ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించడం ఎస్వీఆర్ గొప్పతనం. అయితే కొంత మంది ఎస్వీఆర్ ను ఆహంభావిగా చెబుతుంటారు. ఆలాంటి ఒక సంఘటన ‘హరిశ్చంద్ర’ షూటింగ్ సమయంలో జరిగింది.

advertisements - Call 040 4260 1008


1956 లో విడుదలైన 'హరిశ్చంద్ర' సినిమాను తెరకెక్కిస్తోన్న రోజులు ... ఈ సినిమాలో ఎస్వీఆర్ హరిశ్చంద్రుడు కాగా  విశ్వామిత్రుడుగా గుమ్మడి నటిస్తున్నారు. కథా పరంగా తనని మన్నించమంటూ విశ్వామిత్రుడి కాళ్ళపై హరిశ్చంద్రుడు పడగా, ఆయన తలపై విశ్వామిత్రుడు తంతాడు. దాంతో హరిశ్చంద్రుడి కిరీటం కింద పడిపోవాలి. అయితే ఇలాంటి సన్నివేశంలో నటించడానికి ఎస్వీఆర్ ఒప్పుకోలేదు. గుమ్మడి తన తలని తన్నడమేంటి? అన్నట్టుగా దర్శకుడిని ఎగాదిగా చూసి, కోపంతో విసవిసా అక్కడినుంచి వెళ్లిపోయారట. ఆయన ప్రవర్తన అక్కడ ఉన్న యూనిట్ సభ్యులను ఆయోమయంలో పడవేశింది. 

తలపై తన్నించుకోవడాన్ని ఎస్వీఆర్ సెంటిమెంట్ గా భావించి ఉంటారని కొంతమంది భావించి ఉండగా, మరికొంత మంది ఎస్వీఆర్ ఆహాంభావి అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: