బాహుబ‌లి మూవీలో అనుష్క డూప్‌గా సోనాక్షి సిన్హా న‌టిస్తుంది. బాహుబ‌లి మూవీకు కాస్టింగ్ కూడ కంప్లీట్ అవ్వలేదు, రాజ‌మౌళీ సోనాక్షి సిన్హాకు క‌నీసం కాల్ కూడ చేయ‌లేదు, మ‌రి బాహుబ‌లి సీన్‌లోకి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి ఎలా వ‌చ్చిందంటారా. ఇదిగో ఇలా వ‌చ్చింది.

టాలీవుడ్‌లో బంప‌ర్ హిట్ అయిన మూవీ విక్రమార్కడు. ఈ మూవీలో అనుష్క న‌టిస్తే, దీన్ని బాలీవుడ్‌లో రిమేక్ చేసిన రౌడీరాథోర్‌లో సోనాక్షి హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు త‌మిళ్ సింఘం-2లో సూర్యా స‌ర‌స‌న అనుష్క న‌టిస్తే, హింది సింఘం సీక్కెల్‌లోనూ అజ‌య్‌దేవ‌గ‌న్ సోనాక్షికే ఓటు వేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌న్ ఆఫ్ స‌ర్ధార్ సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ ఓ కార‌ణం.

advertisements - Call 040 4260 1008



తెలుగులో జేజ‌మ్మ త‌డాఖా చూపించిన అరుంధ‌తి మూవీలో అనుష్క మెయిన్‌రోల్ చేసింది. బాలీవుడ్‌లో సోనాక్షి మెయిన్ రోల్‌గా కొన్ని క‌థ‌ల‌ను వింటుంద‌ట‌. అయితే బాలీవుడ్‌ను ఏలుతున్న రిమేక్‌రాజా ప్రభుదేవా, సోనాక్షి వ‌ద్దకు జేజ‌మ్మ న‌టించిన అరుంధ‌తి క‌థ‌ను ముందుంచాడ‌ట‌. ఈ స్టోరికి దాదాపు ఓకే చేసింద‌ని, అయితే అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌టానికి ఇంకా టైం ప‌డుతుంద‌ట‌.


ఆ ర‌కంగా చూసుకుంటే తెలుగులో వ‌స్తున్న బాహుబ‌లి మూవీను, హిందీలో రిమేక్ చేస్తే అందులోనూ ఖ‌చ్చింతంగా సోనాక్షిసిన్హానే హీరోయిన్ అంటున్నారు. ఆ విధంగా అనుష్క న‌టించిన ఏ రిమేక్ మూవీ అయినా బాలీవుడ్‌లో సోనాక్షిసిన్హా న‌టించాల్సిందే. దాంతో అనుష్క డూప్ సోనాక్షి అని బిటౌన్‌లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: