టాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ వన్ హీరోగా చెలామణీ అవుతున్న నటుడు మహేష్ బాబు. సినిమా సినిమాకు అతని క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునో లేక, నిజంగా సినిమాకు ఈ టైటిల్ అవసరమో కానీ.. అతని కొత్త సినిమాకు ‘నెంబర్ వన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్  ను మే 31న విడుదల చేయున్నారు. ఆ రోజు సూపర్ స్టార్ క్రిష్ణ జన్మదినం అనే విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ‘నెంబర్ వన్’ అనే టైటిల్ ఖరారుచేసిట్లు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి తాజా సమాచారం.

advertisements - Call 040 4260 1008



‘నెంబర్ వన్ ’ అనే టైటిల్ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘నెంబర్ వన్ ’ అనే టైటిల్ తో కృష్ణ హీరోగా ఒక సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: