పుష్క‌ర‌కాలం క్రితం చేసిన సినిమానే ఇప్ప‌టికీ చెప్పుకొంటుంటాడు శ్రీ‌కాంత్‌. అదే ఖ‌డ్గం. ఆ సినిమా త‌ర‌వాత ఆ రేంజు పాత్ర‌లు రాలేద‌నే చెప్పాలి. ఆ లోటు మ‌హాత్మ‌, ఆప‌రేష‌న్ దుర్యోధ‌న సినిమాలు తీర్చాయి. ఇప్పుడు ఆచార్య కూడా ఆ స్థాయి సినిమానే... ఆచార్య‌. నిజానికి మహాత్మ త‌ర‌వాత శ్రీ‌కాంత్ సినిమాలేవీ ఆక‌ట్టుకోలేదు. మ‌హాత్మ క్రిటిక‌ల్ అప్లాజ్ తెచ్చుకొన్నా... పెట్టుబ‌డి తిరిగి రాలేదు. అయినా స‌రే... శ్రీ‌కాంత్‌కి అవ‌కాశాలొస్తూనే ఉన్నాయి. కార‌ణం... శాటిలైట్ హ‌క్కుల రూపంలో శ్రీ‌కాంత్ సినిమాకి ఎంతో కొంత తిరిగి వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతోనే.

advertisements - Call 040 4260 1008




కేవ‌లం శాటిలైట్ హ‌క్కుల్ని దృష్టిలో ఉంచుకొనే త‌క్కువ క్వాలిటీతో సినిమాలు చుట్టేస్తున్నారు. అయితే ఆచార్య మాత్రం అలాంటి సినిమా కాద‌ని.. శ్రీ‌కాంత్ చెబుతున్నాడు. ``ఏదో సినిమా తీసేద్దాం అనే ఉద్దేశంతో ఈ సినిమా తీయ‌డం లేదు.. వంశీకృష్ణ చెప్పిన క‌థ నచ్చింది. సందేశాత్మ‌కంగా సాగుతుంది. ఖ‌డ్గం, మ‌హత్మ రేంజు సినిమా ఇది..`` అని శ్రీ‌కాంత్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: