మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు చుక్క‌లు చూపించింది త‌రుణ్ సినిమా. రాదు.. రాదు.. అనుకొన్న చుక్క‌లాంటి అమ్మాయి, చ‌క్క‌నైన అబ్బాయి సినిమా ఈ శ‌నివారం గ‌ప్‌చుప్ గా విడుద‌లైంది. త‌రుణ్ సినిమా అంటే కాలేజీ కుర్రాళ్ల‌యినా వెళ్లేవారు. కాస్త‌లో కాస్త అమ్మాయిల్లో త‌రుణ్‌కి క్రేజ్ ఉంది. చివరికి వాళ్లు కూడా ఈ సినిమాని చిన్న చూపు చూశారు. దాంతో  జ‌నాల్లేక థియేట‌ర్లు బోసిబోయాయి. వెళ్లిన కొద్ది మందీ.. ఈ సినిమా థాటికి విల‌విల్లాడారు. త‌రుణ్‌కి హిట్ కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌నే విష‌యం మ‌రోమారు అర్థ‌మైంది.

advertisements - Call 040 4260 1008




ఇది చాల‌ద‌న్న‌ట్టు... ఈ చిత్ర‌బృందం రెండో రోజే ప్రెస్‌మీట్లు పెట్టి... మా సినిమాకి బోలెడు డ‌బ్బులొస్తున్నాయ్‌... వ‌సూళ్లు ఫుల్‌... టికెట్లు దొరక‌డం లేదంటూ సొంత డ‌బ్బా కొట్టేశారు. అన్న‌ట్టు ఈ కార్య‌క్ర‌మానికి త‌రుణ్ రాలేదు. సినిమా నిజ్జంగా హిట్ అయితే.. మొహం చూపించేవాడేగా..??  పాపం... త‌రుణ్‌కి హిట్ ఎప్పుడొస్తుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: