టాలీవుడ్ సినిమాలో కొంతకాలం  కొన్ని ట్రెండ్స్ కొనసాగుతూ ఉంటాయి. ప్రేక్షకులను ధీయేటర్లకు రప్పించడానికి దర్శకులు, హీరోలు ఇటువంటి ట్రెండ్స్ కు శ్రీకారం చుడతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోతున్న రెండు పెద్ద సినిమాలలో ఆ సినిమాలు హిట్ అవ్వడానికి గుండు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ సినిమాలోనూ నాని హీరోగా నటిస్తున్న ‘జండా పై కపిరాజు’ సినిమాలోనూ ఆ సినిమాలలో నటిస్తున్న హీరోలు కొంత సేపు గుండు గెటప్ లో నాటించ బోతున్నారు.

ఇప్పటికే ఈ గుండు గెటప్ లకు సంబంధించిన హీరోల ఫోటోలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ‘జండా పై కపిరాజు’ సినిమాలో నటిస్తున్న హీరో నాని అయితే 48 సంవత్సరాల వయస్సు ఉన్న పాత్రలో నేగిటివ్ పాత్రలో కనిపించ బోతున్నాడు. హీరోలు గుండు గెటప్ తో నటించి సూపర్ హిట్ కొట్టచ్చని ‘గజని’ సినిమాలో హీరోగా నటించిన సూర్య ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు.

advertisements - Call 040 4260 1008


అదే విధంగా హీరో విక్రమ్, కమలహాసన్, శరత్ కుమార్ లు కూడా ఈ గెటప్ తో నటించి తమ సినిమాలను సూపర్ హిట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ ను అనుసరిస్తూ కళ్యాణ్ రామ్, నానిలు వారి రాబోతున్న సినిమాలకోసం ఇలా డిఫరెంట్ గా కనిపిస్తూ, వారి సినిమాల సక్సస్ కు బాటలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ గుండు సెంటిమెంట్ మన హీరోలకు సూపర్ హిట్స్ యిచ్చి, బాగానే కాసుల వర్షం కురిపిస్తున్నాయి....     

మరింత సమాచారం తెలుసుకోండి: