ప్రపంచ సినిమా చరిత్రలో ఏ నటుడైనా ఒక విభాగంలో రాణించాడు. అయితే అన్ని విభాగాల్లోనూ తిరుగులేని విధంగా రాణించినటుడు ఎన్టీఆర్. ఒక నటుడికి పౌరాణిక, జానపదం, చారిత్రాత్మకం, సాంఘికం.. ఇలా విభిన్న తరహా సినిమాల్లో నటించే అవకాశం దక్కడమే అదృష్టం. అయితే ఈ సినిమాల్లోనూ తిరుగులేని విధంగా రాణించాలంటే ఎంతో గొప్పతనం ఉండాలి. అలాంటి గొప్పనటుడే స్వర్గీయ ఎన్టీఆర్.

ఎన్టీఆర్ 1923, మే 28న నిమ్మకూరు లో జన్మించారు. 1949లో విడుదలైన ‘మనదేశం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తరువాత ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి తెలుగు వారి గుండెల్లో దేవుడిగా కొలువుతీరారు. రాముడు, కృష్ణుడు పేర్లు వింటే తెలుగువారికి ఎన్టీఆర్ గుర్తుకువస్తాడు. పరమశివుడు, రావణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలూ జనరంజకంగా పోషించారు. శ్రీకృష్ణ దేవరాయులు, చంద్రగుప్తుడు వంటి చారిత్రాత్మక పాత్రలను మెప్పించారు. పాతాళభైరవి, బందిపోటు.. వంటి జనపద సినిమాలతోనూ మెప్పించారు. ఇక సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ ప్రతిభ అందరకి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా అద్భుతంగా రాణించారు. సంవత్సరానికి 10 సినిమాలకు పైగా నటించడం ఎన్టీఆర్ మరో గొప్పతనం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 300 వరకూ సినిమాల్లో ఎన్టీఆర్ నటించారు.

advertisements - Call 040 4260 1008



సినిమాల్లో ఇంత అమోఘమైన స్థాయిలో రాణించిన ఎన్టీఆర్ రాజకీయరంగంలోనూ తన సత్తా చూపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి దాన్ని 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇలా.. అన్ని రంగాల్లోనూ తిరుగులేని విధంగా రాణించడం ఎన్టీఆర్ గొప్పతనం.

మరింత సమాచారం తెలుసుకోండి: