వెంక‌టేష్-రామ్‌ల మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన బోల్ బ‌చ్చ‌న్‌కి ఇది రీమేక్‌. ఈ సినిమాకి గ‌ర‌మ్ మ‌సాలా అనే పేరు పెట్టార‌ని చెప్పుకొన్నారు. అయితే... ఈ టైటిల్ మార్చేస్తార‌ట‌. ఈ సినిమాకి గోల్‌మాల్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది.

advertisements - Call 040 4260 1008



వెంకీకి లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌. గ‌ర‌మ్ మ‌సాలా... అని ఘూటుగా పెడితే ఫ్యామిలీ లేడీసు థియేట‌ర్‌కి రావాలా?  వ‌ద్దా??  అనే ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. అందుకే.... ఈ సినిమా టైటిల్ మార్చేసి గోల్‌మాల్ అని పెట్టేద్దాం అనుకొంటున్నారు. విజ‌య్‌భాస్క‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అంజ‌లి, షాజ‌న్ ప‌ద‌మ్‌సీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: