దేశ‌ముదురు త‌ర‌వాత అల్లుఅర్జున్, పూరి జ‌గన్నాథ్ క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ఇద్ద‌ర‌మ్మాయిల‌తో. అమ‌లాపాల్‌, కేథ‌రిన్ క‌థానాయిక‌లు. ఈ శుక్ర‌వారం ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాకి రిపేర్లు భారీ ఎత్తున జ‌రిగాయ‌ని, విడుద‌ల‌కు ముందు కొన్ని ప్యాచ్ వ‌ర్క్‌లు చేశారనే రూమ‌ర్లు వినిపించాయి. ఈ విష‌యాన్ని బ‌న్నీ లైట్‌గా తీసుకొంటున్నాడు.

''అలా రీషూట్లేం చేయ‌లేదు. ఆ అవ‌స‌రం కూడా లేదు. పూరి ఈ సినిమాని చాలా చక్క‌గా తీశారు. ఆయ‌న సినిమా ఎప్పుడూ 70, 80 రోజుల్లో అయిపోతుంది. మాది మాత్రం వంద రోజులు ప‌ట్టింది. అదంతా క్వాలిటీ కోస‌మే. ఇలాంటి క‌థ మీరెప్పుడూ చూసి ఉండ‌రు. మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది..'' అంటూ త‌న సినిమా గురించి గొప్ప‌లు చెప్పుకొంటున్నాడు.

advertisements - Call 040 4260 1008


మ‌రి సినిమాలో అంత సీన్ ఉందా?  లేదా?  అనేది ఈ శుక్ర‌వారం తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: