న‌రేష్‌, ర‌విబాబు కెరీర్‌ల‌నే కాదు, ఇంటి పేరునీ మార్చేసింది అల్ల‌రి. ఆ సినిమా త‌ర‌వాత అల్లరి న‌రేష్‌, అల్ల‌రి ర‌విబాబు అయిపోయారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం రాబోతోంది. ఈ సినిమా అల్ల‌రి 2 అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అది అల్ల‌రి 2 కాద‌ట‌. వేరే క‌థ అట‌. ఈ విష‌యాన్ని న‌రేష్ స్వ‌యంగా చెప్పాడు.

advertisements - Call 040 4260 1008



''ర‌విబాబుతో ఓ సినిమా చేస్తున్న మాట నిజ‌మే. అయితే అది అల్ల‌రికి కొన‌సాగింపు కాదు. పూర్తిగా వేరే క‌థ‌. అల్ల‌రి ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా ఎలా నిలిచిందో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతా..'' అంటున్నారాయ‌న‌. ప్ర‌స్తుతం యాక్ష‌న్‌, కెవ్వు కేక సినిమాలతో బిజీగా ఉన్నారు. జూన్ మొద‌టి వారంలో యాక్ష‌న్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: