బాహుబ‌లి గురించి రోజుకో కొత్త విష‌యం తెలుస్తూనే ఉంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌నేది లేటెస్ట్ న్యూస్‌. అంతే కాదు.. ఈ సినిమా రెండు భాగాలుగా చూపిస్తార‌ట‌.

advertisements - Call 040 4260 1008



రాజ‌మౌళి తయారు చేసుకొన్న ఫైన‌ల్ స్ర్కిప్టు ప్ర‌కారం... ఈ సినిమా నిడివి దాదాపుగా 4 గంట‌లు వ‌స్తోంద‌ట‌. ఎంత ఎడిట్ చేద్దామ‌నుకొన్నా ఆ అవ‌కాశం ఎక్క‌డా లేద‌ట‌. ఒక వేళ తీసేసినా... క‌థ‌లో ఉన్న కంటిన్యుటీ, ఫీల్ దెబ్బ‌తింటుంద‌ట‌. అంద‌కే ఈ సినిమాని రెండు భాగాలుగా చూపించాల‌ని రాజ‌మౌళి అండ్ కో డిసైడ్ అయ్యంది. సినిమా అంతా ఒకేసారి తీసేస్తారు. కానీ రెండు ద‌ఫాలుగా విడుద‌ల చేస్తార‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: