పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దృష్టి అంతా తన లేటెస్ట్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఫై కేంద్రీకరించాడు. ఆగస్టు లో ఈ సినిమా రిలీజ్ ఉండటం తో సినిమా దర్శకుడు త్రివిక్రమ్ పవన్ ను పరుగులు తీయిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక హోటలులో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఇది పూర్తయిన వెను వెంటనే తన అత్తవారింటికి దారి వెతుక్కుంటూ హీరోయిన్ సమంతతో యూరప్ జూన్ మొదటి వారంలో వెళ్ళుతున్నాడు. అక్కడ కొన్ని ముఖ్య సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తాడట. గత కొన్ని రోజులుగా పవన్, దర్శకుడు త్రివిక్రమ్ కు ఒక ట్విస్ట్ ఇస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా పేరును ‘అత్తారింటికి దారేది’ అంటూ పాపులర్ చేసారు కానీ ఈ సినిమా టైటిల్ పై పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి ఈ సినిమాకు ఇలాంటి పేరేంటి బాబోయ్ అని గగ్గోలు పెట్టడంతో ఈ  సినిమా టైటిల్ మార్చడమే మంచిది అన్న అభిప్రాయానికి పవన్ వచ్చాడని  చెపుతున్నాడు. సినిమా టైటిల్ తెలుగు దనం ఉండచ్చు కానీ మరీ ఇంత తెలుగు తనమా అంటూ పవన్ అభిమానుల అభిప్రయమట. మరి ఇక ఈ సినిమాకు ఎటువంటి కొత్త టైటిల్ పెడతారో చూద్దాం.....  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: